హోలీ పండుగ నాడు అందరూ సరదాగా గడుపుతూ ఉంటారు. ఎంతో సందడిగా అనేక వంటలతో ఆనందంగా వుంటారు. అయితే హోలీ నాడు పాటించే ప్రతి విషయం లోనూ కూడా లాభాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం..!
చల్లటి పానీయాలు:
హోలీ నాడు బాంగ్ లస్సి, బాంగ్ తాండాయి మొదలైన వాటిని చూసుకుంటూ ఉంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలానే వీటిల్లో బాదం, పుచ్చకాయ గింజలు ఇలా న్యూట్రియన్స్ ఎక్కువ ఉన్న వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
సహజమైన రంగులు:
కెమికల్స్ లేకుండా సహజమైన రంగుల తో హోలీ ఆడడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మందారం పువ్వు, గోరింటాకులు, చందనం పొడి ఇటువంటివన్నీ కూడా జుట్టుకి మరియు చర్మానికి కూడా మంచిది. ఇవి చర్మాన్ని శుభ్ర పరచి మరియు మృత చర్మాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఇలా సహజమైన రంగులు వాడటం వల్ల కూడా లాభాలు ఉన్నాయి.
హోళికా దహనం:
హోలీ సందర్భంగా హోళికా దహనం చేస్తారు. అయితే ఈ సీజన్ లో బ్యాక్టీరియా మరియు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హోళికా దహనం చేసి ఆ మంట చుట్టూ తిరగడం వల్ల బ్యాక్టీరియా తొలగి పోతుంది. ఇలా మనకి ప్రయోజనం కలుగుతుంది.