బెండకాయలో ఉండే జిగురు ఇంత పనిచేస్తుందా..? అధ్యయనంలో వెల్లడైన షాకింగ్ నిజం

-

మనందరం తినే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.. ఇవి ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 గ్రాముల శక్తిని ఇస్తుంది. బేసిక్గా ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు రుచిగా ఉండటంతో బాగా లాగించేస్తాం. ఫలితంగా లావు అవుతారు. అధికబరువు కాస్త ఒబిసిటీకి దారితీస్తుంది. మన ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు రక్తంలోకి చేరకుండా.. మలం ద్వారా కిందకు వెళ్లలా చేయాడనికి బెండకాయ ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు.

బెండకాయలో న్యూసిలేజ్ అనే ( Nuclease) కెమికల్ ఉంటుంది. అందుకే బెండకాయలు జిగటగా ఉంటాయి. 1100 మంది మీద పరిశోధన చేసి..మనం తిన్న ఆహారపదార్థాల్లో ఉండే కొవ్వును ఈ జిగట పదార్థం పట్టుకుని రక్తం లోపలకి చేరకుండానే.. మోషన్ ద్వారా లాక్కొచ్చి బయటకు వెళ్లేట్లు చేస్తుందని సైంటిస్టులు గుర్తించారు.. కొవ్వు ఎంత లోపలకి చేరితే మనిషి అంత బరువు పెరుగుతాడు. ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. హార్ట్ కు కొవ్వు అస్సలు మంచిది కాదు. ఇంకా బెండకాయలో ఉండే పాలిఫినాల్స్, యాంటిఆక్సిడెంట్స్ హార్ట్ కు బాగా ఉపయోగపడుతున్నాయని కూడా 2017వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ బార్శిలోనా- స్పెయిన్( University of Barcelona- Spain) వారు పరిశోధన చేసి ఇచ్చారు.

మనందరికి బెండకాయ తింటే బ్రెయిన్ కు చాలామంచిదని, తెలివితేటలు పెరుగుతుయాని తెలుసు. ఇది కరెక్ట్ అని స్పెయిన్ దేశంవారే మరొక పరిశోధన చేసి ఇచ్చారు. మన నరాల కణాల్ని, మెదడు కణజాలాన్ని ఆక్సిడెషన్ జరగకుండా, కణజాలం దెబ్బతినకుండా రక్షించడానికి బెండకాయలో ఉండే కమికల్స్ ఉపయోగపడుతున్నాయని, తద్వారా మెదడు కణజాలం, నరాల కణజాలం ఆయుర్థాయం పెరుగుతుందని.. దానివల్ల ఆలోచించే శక్తి, అర్థంచేసుకునే శక్తి, నేర్చుకునే శక్తి పెరుగుతుందని స్పెయిన్ దేశస్థులే సైంటిఫిక్ గా పరిశోధన చేసి ఇచ్చారు.

ఇతర కూరగాయలతో పోలిస్తే బెండకాయలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇవి తిన్న ఆహారం ద్వారా చెక్కర రక్తంలోకి స్పీడ్ గా చేరకుండా స్లోగా వెళ్లేట్లు చేస్తుందని స్పష్టంగా సైంటిస్టులు 2013వ సంవత్సరంలో షాంగాయ్ యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చైనా వారు (Shanghai University of Traditional Chinese Medicine) ఎలుకల మీద పరిశోధన చేసి ఇచ్చారు.డయబెటీస్ ఇది చాలా మంచి విషయం.

అయితే ఇన్ని లాభాలు బెండకాయలో ఉన్నాయి కానీ మనం సరిగ్గా వాడుకుంటేనే ఇవన్నీ పొందగలం. చక్కగా ముక్కలు కట్ చేసి.. నూనెలో వేసి దేవి తిన్నారంటే.. ఆ వేడికి జిగురు ఎగిరిపోతుంది. బెనిఫిట్స్ సున్నా. అన్నీ కెమికల్స్ పోతాయి. కాబట్టి ఇలా వండుకోకుండా..కట్ చేసి..
నూనెలేకుండా.. గిన్నెలో వేసి పొయ్యిమీద పెట్టి మూతపెడితే..ఆ ఆవిరికి ఉడికిపోతుంది. బెండకాయ ఎక్కువసేపు ఉడికించకర్లా. 50శాతం చాలు. ఇక అందులో పెరుగు వేసి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు మాములు కూరల్లో వేసుకున్నట్లే వేసి వండుకుంటే జిగురు అసలు ఎటూపోదు. కమ్మగా ఉంటుంది. మరీ నూనె లేకండా తినలేకపోతున్నాం అనుకునేవాళ్లు కొద్దిగా నూనె వేసుకోండి. ఇలా వండుకుని డైలీ లంచ్ లో సైడ్ డిష్ గా పెట్టుకుని తింటే.. ఒబిసిటీ, డయబెటీస్ రాకుండా అడ్డుకట్ట వేసినట్లే. ఇవి లేవు అంటే.. గుండెఆరోగ్యం కూడా బాగున్నట్లే.

సైంటిఫిక్ గా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని నిరూపించారు కాబట్టి.. బెండకాయను లైట్ తీసుకోకుండా.. వెయిట్ తగ్గించుకోవడానికి వాడేయండి..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version