సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ.. మరింత అభిమానాన్ని సొంతం చేసుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఇక నిర్మాతలు కూడా నయనతార కు ఉన్న క్రేజ్ ను చూసి ఆమెకు ఎంత పారితోషికం అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా నయనతార ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ ను ప్రేమించు మరీ ఈనెల 9వ తేదీన వివాహం చేసుకోబోతోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
కాకపోతే ఇలా వైరల్ అవుతున్న విషయం పై అటు నయనతార కానీ విఘ్నేష్ శివన్ కానీ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.వరుస విజయాలతో చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతున్న నయనతార ఉన్నట్టుండి పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలి అంటే మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.