ఖచ్చితమైన రాబడి… వంద ఆదా చేస్తే రూ.15 లక్షలు పొందచ్చు…!

-

మీరు ఖచ్చితమైన రాబడి పొందాలని అనుకుంటున్నారా…? సుకన్య సమృద్ధి అకౌంట్ మీకు లేదా…? అయితే తప్పక ఓపెన్ చెయ్యని. ఒకవేళ ఈ ఖాత కనుక ఉంటే మంచి రాబడి పొందొచ్చు. రోజుకు కేవలం రూ.100 ఆదా చేస్తే ఏకంగా రూ.15 లక్షలు వరకు పొందొచ్చు.

డబ్బులు
డబ్బులు

మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ ‌లో కేవలం ఆడ పిల్లలు మాత్రమే చేరడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు కనుక వున్నా కూడా ఈ పథకం లో చేరొచ్చు.

దీనిలో అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇది ఇలా ఉంటే సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

మీరు నెలకు రూ.3 వేలు ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ కాలంలో రూ.15 లక్షలకు పైగా పొందొచ్చు. అంటే రోజుకు రూ.100 ఆదా చేస్తే సరి పోతుంది. ఈ పథకంలో చేరాలని భావించే వారు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి తెరవచ్చు. ఆడపిల్లకి పద్దెనిమి ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత డబ్బుని కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా మంచి బెనిఫిట్స్ ఈ స్కీమ్ వలన కలుగుతాయి. పైగా రాబడి కూడా ఖచ్చితంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news