కరోనా పేషెంట్లకి ఫిజియోథెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు..!

-

మనందరికీ తెలుసు కరోనా కారణంగా ఆరోగ్యం పై ఎంత ప్రభావం చూపుతుంది అనేది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది మరణించారు. మరి కొందరైతే తీవ్ర అనారోగ్య సమస్యల నుండి కష్టపడి బయటపడ్డారు. అయితే కరోనా మహమ్మారి నుండి రికవరీ అయ్యే వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఫిజియోథెరపిస్ట్ అన్నారు. మరి ఇక దీని కోసం పూర్తిగా ఇప్పుడే తెలుసుకుందాం.

కరోనా

ఐసీయూలో ఫిజియోథెరపీ:

ముందు మనం ఐసీయూలో ఫిజియోథెరపీ గురించి చర్చించుకుందాం. కరోనా మహమ్మారి బారిన పడిన పేషెంట్లు ఐసీయూ లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల ఏమవుతుంది అనేది చూస్తే.. ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడిన వాళ్ళకి శ్వాస సంబంధిత వ్యాయామాలు చెప్పేవారు.

దీంతో ఊపిరితిత్తుల సమస్య ఉండకుండా ఉంటుంది. అదే విధంగా కఫము తో దగ్గు కలిగితే కఫముని తొలగించడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పేవారు. వీటి కారణంగా వాళ్ళల్లో అనారోగ్య సమస్యలు తగ్గేవి.

అదే విధంగా చాలా మందిలో బలహీనత, రెస్పిరేటరీ రేటు పెరిగిపోవడం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. వీటి నుండి బయట పడడానికి ఫిజియోథెరపీ బాగా ఉపయోగ పడిందని ఫిజియోథెరపిస్ట్ చెప్పారు.

డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ:

కరోనా బారినపడి ఆస్పత్రి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన తర్వాత ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తే.. రికవరీ అయిన పేషెంట్లకు ఫిజియోథెరపీ ఎలా చేస్తారంటే..? ఒక గంట పాటు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయిస్తారు. అలానే ఏరోబిక్స్ చేయిస్తారు.

దీని వల్ల పేషెంట్లు రిలాక్స్ గా వుంటారు. ఇలాంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు పేషెంట్లకు చాలా ఉపయోగ పడ్డాయని అన్నారు. అదే ఒకవేళ ఆ పేషెంట్ కి దగ్గు ఉంటే వాళ్లకి కొన్ని టెక్నిక్స్ చెప్పి దాని నుండి బయట పడేసే వారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ లో స్టామినా పెరిగి సమస్యలు తగ్గేవి.

ఆక్సిజన్ సపోర్ట్ తో ఇంట్లో ఉండే వాళ్ళకి:

ఆక్సిజన్ సపోర్టు ఇంట్లో ఉండే వాళ్ళకి వ్యాయామాలు చెప్తారు. ఈ వ్యాయామాల వల్ల పేషెంట్లలో కెపాసిటీ పెరుగుతుంది. కొన్ని ఏరోబిక్ ఎక్సర్సైజ్లు కూడా వాళ్ళకి బాగా ఉపయోగ పడతాయి. ట్రెడ్ మిల్, క్రాస్ ట్రైనర్, సైకిల్ అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి.

ఫిజియోథెరపీ చేయించడం వల్ల ఎటువంటి ఫలితం కనబడుతుంది అంటే..?

వ్యాయామాలు చేయడం వల్ల కరోనా పేషెంట్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. అలానే వాళ్ళల్లో నమ్మకం ఎక్కువవుతుంది. ఆరు వారాల పాటు ఫిజియోథెరపీ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కనబడతాయని ఫిజియోథెరపిస్ట్ అంటున్నారు.

ఆ తర్వాత శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసుకుంటే సరి పోతుందని దీని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని… మానసికంగా కూడా వాళ్ళు రిలాక్స్ గా ఉంటారని అన్నారు ప్రతి రోజూ అరగంట పాటు నడవడం కూడా బాగా ఉపయోగ పడుతుందని ఫిజియోథెరపిస్ట్ అంటున్నారు. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఫిజియోథెరపి తో ఈజీగా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news