కరోనా సెకండ్ వేవ్‌తో దేశమంతా భయాందోళనలు గురవుతున్న తరుణంలో, ఈ వైరస్ వివిధ రూపాల్లోకి మారుతుంది. అయితే, ఒబెసిటీ ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇవి ఇటీవలి నిపుణుల పరిశోధన ల్లో తేలింది. ఒబెసిటీ ఉన్నవారిలో కరోనా చికిత్స వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సెకండ్ వేవ్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.
శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇక కరోనా సమయంలో చాలా ఫిట్‌గా ఉండాలని వైద్యులు చెబుతున్నారు . ఒబెసిటీ ఉన్న వాళ్లు కరోనా ట్రీట్‌మెంట్‌కి చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరికి హయ్యర్ వెంటిలేషన్ ప్రెజర్ అవసరమవుతోంది. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉండి పొట్ట ఉన్న వ్యక్తుల కొంటే, సన్నగా ఉన్నా పొట్ట లేని వారు కరోనా నుంచి త్వరగా కోలుకుంటున్నారట. ఇప్పటికే కరోనా మూడో వేవ్ పొంచి ఉందంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఈ సమయంలో ఫిట్‌నెస్‌పై ప్రజలు మరింత దృష్టి సారించాలని అంటున్నారు. కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఫిట్‌గా ఉండటం చాలా అవసరం అని చెబుతున్నారు.
ఒబేసిటీతో లంగ్ కెపాసిటీలో తగ్గుదల ఉంటుందని కొందరు పరిశోధకులు తెలిపారు. శరీరంలో ఛాతి, అబ్‌డామిన్స్ పై కొవ్వు పెరగిపోతున్నప్పుడు లంగ్స్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దాని వల్ల అవి కంప్రెస్ అయిపోతాయి. దీంతో లంగ్స్ పనితీరులో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒబెసిటీ ఉన్న పేషంట్లను వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫ్లమెటరీ మార్కర్ల అవసరం కూడా ఎక్కువవుతుంది.
కరోనా సోకినప్పుడు లంగ్స్ ఎక్స్‌పాన్షన్ అనేది కీలకం. ఒబెసిటీ పేషంట్లలో లంగ్స్ ఎక్స్‌పాన్షన్
దగ్గర సమస్యలు తలెత్తుతాయి. దీంతో రికవరీ అప్పుడు ఫిజియోథెరపీ అవసరం కూడా పడతుంది. దీంతోపాటు ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్‌లు సైజు , పొట్ట కింద పెట్టుకోవాల్సిన దిండ్లు ఇలా అన్ని చోట్లా ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా ఒబెసిటీ పేషంట్లు వైద్యానికి స్పందించరు. కరోనా విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఎక్సర్‌సైజ్‌లు చేయడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.