పీఎం కిసాన్ కింద భార్యాభర్తలు ఇద్దరూ డబ్బులు తీసుకుంటున్నారా..? అయితే తప్పక ఇలా చేయండి..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే కేంద్రం రైతుల కోసం కూడా కొన్ని స్కీమ్స్ ని అందిస్తోంది. వాటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ తో రైతులు ప్రతీ ఏడాదీ కూడా రూ.6 వేలు పొందొచ్చు. డైరెక్టుగా ఇవి రైతుల ఖాతా లో పడతాయి. ఈ డబ్బులు విడతల వారీగా పడతాయి.

farmers

మోదీ సర్కార్ ఇప్పటి దాకా 10 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేసింది. 11వ విడత డబ్బులు ఇప్పుడు రావాల్సి వుంది. ఈ డబ్బులు ఏప్రిల్ నెలలో వచ్చే అవకాశం వుంది. అయితే ఇక్కడ పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే డబ్బులొస్తాయి.

ఇంట్లో భార్యకి కానీ లేదు అంటే భర్త కి కానీ డబ్బులు వస్తాయి. అంతే కానీ ఇద్దరికీ డబ్బులు రావు. ఒకవేళ ఇంట్లో ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు వస్తే.. ఒకరి డబ్బులను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి. లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల మీ ఇంట్లో ఇద్దరికి పీఎం కిసాన్ డబ్బులు వస్తే వాటిని వెనక్కి ఇచ్చేయండి.

భార్య భర్తా ఇద్దరు ఈ డబ్బులు తీసుకుంటున్నట్టయితే వెనక్కి ఇచ్చేయడం మంచిది. అర్హత లేని వాళ్ళు ఈ స్కీమ్ కింద డబ్బులు పొందడం వలన రూ.2,900 కోట్లు నష్టం కేంద్రానికి వచ్చింది. కనుక అర్హత లేని వాళ్ళు కూడా తీసుకోకండి. లేదు అంటే చివరలో మీకే ఇబ్బంది అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news