రష్యా – ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కాగ దీనిపై తాజా గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రష్యా యుద్దం కోరుకోవడం లేదని అన్నారు. కానీ ఉక్రెయిన్ పై దాడి చేసే అవకాశం ఉందని పుతిన్ అన్నారు. కాగ రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని పశ్చిమ దేశాలు.. పుతిన్ తో పలు మార్లు చర్చించాయి. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యుద్ధంపై వెనకడుగు వెసినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బలగాలను వెనక్కి తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా కు చెందిన లక్షల మంది సైనికులను మోహరించారు. అయితే తాజా గా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైనికులను ఉపసంహరించుకున్నారు. అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. రష్యా ఎవరితోనూ యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కానీ ఉక్రెయిన్ పై దాడి చేయడానికి అవకాశాలు ఉన్నాయని పుతిన్ సంకేతాలను జారీ చేశారు. అయితే ఉక్రెయిన్ తో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.