మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? మీరు డెబిట్ కార్డ్ ని వాడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఉంటే ఈజీగా షాపింగ్ చెయ్యడానికి లోన్ ని పొందవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు వుంది షాపింగ్ చేయాలి అంటే లోన్ వస్తుంది. పైగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ లో అయినా సరే షాపింగ్ చేసిన లోన్ అనేది లభిస్తుంది.
అదే విధంగా ఈజీ ఈఎంఐ ప్రయోజనం పొందవచ్చు. అయితే మీరు తీసుకున్న లోన్ ని 6, 9, 12, 18 నెలల్లో ఎప్పుడైనా సరే పే చెయ్యచ్చు. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఈఎంఐ ద్వారా రూ.లక్ష వరకు లోన్ ని పొందొచ్చు.
Binge-shopping just got better with Easy EMIs. Choose SBI Debit Card EMI and get it done with the best festive offers.#SBI #GetItDoneWithSBI #SBIDebitCardEMI #EasyEMI #FestiveOffer pic.twitter.com/siQ6h5fxHw
— State Bank of India (@TheOfficialSBI) November 10, 2021
అంతే కాకుండా మీరు ఫెస్టివ్ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా పొందొచ్చు. ఆన్ లైన్ స్టోర్ లోన్ లో కానీ లేదు అంటే ఆఫ్‌లైన్ స్టోర్లలో షాప్ చేయడానికి మంచిగా లోన్ ని తీసుకోచ్చు. దీనితో ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డుపైన ఈఎంఐ ఆఫర్ ఉందో లేదో సులభంగానే తెలుసుకోచ్చు కూడా. ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కనుక మీరు అర్హులు కాదో చూడచ్చు. దీని కోసం ఎస్‌బీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 567676 నెంబర్‌కు DCEMI అని ఎస్ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు.