హుజూరాబాద్ ఎన్నికలు ముగిసినా.. దాని రచ్చ మాత్రం తగ్గడం లేదు. గెలుపోటములపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తగ్గడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో వరి కొనుగోలు వివాదంపై కూడా దుమారం చెలరేగుతోంది. తాజాగా ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ లో టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. హుజూరాబాద్ ఓటమి తట్టుకోలేకనే టీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తుందని.. కేంద్రం వరి ధాన్యనం ఎక్కడా కొనుగోలు చేయమని చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు పరిధి దాటి.. బజారు రౌడీల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీనికి చెడ్డ పేరు తేవడం కోసం తప్పా.. రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి లేదని… రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీ కోసం మూడు సార్లు కేంద్రం లేఖలు రాసింది. లేఖలను చదవరు..కానీ బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంటారన అన్నారు. రైస్ మిల్లర్ల లాభం కోసం తప్పితే.. టీఆర్ఎస్ రైతుల మేలు కోసం పనిచేయదన్నారు. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండని వార్నింగ్ ఇచ్చారు.