శివలింగంపై కండోమ్ తో ఆర్ట్..హీరోయిన్ ఘనకార్యం !

Join Our Community
follow manalokam on social media

ప్రముఖ బెంగాలీ నటి సాయోని ఘోష్ చేసిన ఘన కార్యం ఆమెను వివాదంలోకి నెట్టింది. శివలింగంపై ఓ మహిళ కండోమ్ వేసిన ఆమె పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి 2015లో సాయోని ఈ ట్వీట్ చేసింది. కానీ ఆమె అప్పట్లో ఈ వివాదం నుంచి తెలివిగా బయట పడింది. కానీ ఈ ట్వీట్ మరలా వైరల్ కావడం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 18, 2015లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆకృత్యాన్ని ఆమె ట్వీట్ చేయటం పెద్ద వివాదానికి దారితీసింది.

ఆ తరువాత తీరిగ్గా తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని.. ఇది ఆకతాయిలు చేసిన అతి చెడ్డ చర్య అని పేర్కొని బయట పడ్డారు..అయితే ఆమె చెప్పిన హ్యాకింగ్ థియరీ అంతా కట్టుకథ అని చెబుతున్నారు. ఎందుకంటే 2017 వరకు తన అకౌంట్ ను ఆమె నడుపుకోలేక పోయినట్టు ఆమె చెప్పినా తాను నటించిన సినిమాల ప్రమోషన్ ఫొటోలు, వీడియోలు హ్యాకర్ ఎందుకు పోస్ట్ చేస్తారని అడుగుతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం పోతుందో ?

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...