వానా కాలంలో టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఇవే బెస్ట్ 10 ప్లేసెస్..!

-

ఎండల వలన మీరు ఏ టూర్ వెయ్యలేకపోయారా..? వర్షా కాలం లో మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా అయితే కచ్చితంగా మీరు ఈ ప్రదేశాలని చూడాల్సిందే.. వానా కాలంలో మంచి టూర్ వెయ్యాలనుకునే వాళ్ళు ఈ ప్రదేశాలకి వెళ్లొచ్చు. ఎంతో చక్కగా ఉంటాయి ఈ ప్లేసెస్. మీ కుటుంబ సభ్యుల తో లేదంటే ఫ్రెండ్స్ తో మీరు ఈ టూర్ వేసేసి సరదాగా అలా గడపొచ్చు. చిరపుంజి చూడడానికి చాలా బాగుంటుంది ఎంతో మంది వానా కాలం లో ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మంచి ప్లేస్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనికి దగ్గర లో ఉండే ఎయిర్ పోర్ట్ గౌహతి. ఇక్కడ వానా కాలంలో 12° నుండి 16° టెంపరేచర్ ఉంటుంది.

మౌంట్ అబూ కి కూడా వెళ్ళచ్చు ఇక్కడ 22 డిగ్రీల నుండి 30° టెంపరేచర్ ఉంటుంది. దీనికి దగ్గర లో ఉండే ఎయిర్పోర్ట్ వచ్చేసి డబోక్ ఎయిర్పోర్ట్ రాజస్థాన్ ఎడారి కి సమీపంలో మౌంట్ అబూ ఉంది. వాయనాడ్ కూడా చాలా బాగుంటుంది వానా కాలంలో ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ టీ గార్డెన్స్ వంటివి బాగా ఆకట్టుకుంటాయి దీనికి దగ్గరలో ఉండే ఎయిర్పోర్ట్ వచ్చేసి కాలికట్ ఎయిర్పోర్ట్. డార్జిలింగ్ కూడా చూడదగ్గ ప్రదేశం డార్జిలింగ్ వానా కాలంలో చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ తోటలు టాయ్ ట్రెయిన్ పర్యావరణం అందరిని బాగా ఆకట్టుకుంటాయి. 12 నుండి 19 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. క్వీన్ ఆఫ్ హిమాలయస్ అని పిలుస్తారు దీనిని.

కూర్గ్ కూడా చాలా బాగుంటుంది వానా కాలంలో ఇక్కడకి కూడా వెళ్లొచ్చు దగ్గరలో మంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. షిల్లాంగ్ కూడా వానా కాలంలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవులు, గోవా, మున్నార్ ఇవన్నీ కూడా వాన కాలంలో పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో వానా కాలంలో మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలని ప్రిఫర్ చేయొచ్చు. ఎంతో చక్కగా ఈ ప్రదేశాలలో గడిపి రావచ్చు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్లేందుకు ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి టూర్ వేసి వచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news