ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ సినిమా గురించే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ రాముడు, సీతగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఔం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రైలర్ రిలీజ్ వరకు ప్రేక్షకులకు ఈ చిత్రంపై అసలు అంచనాలు లేవు. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత.. గ్రాఫిక్స్ చూసి నెటిజన్లు చేసిన ట్రోలింగ్‌కు మేకర్స్‌కు దిమ్మదిరిగింది. దెబ్బకు దిగొచ్చి.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రేక్షకులను మెప్పించేలా మళ్లీ రూపుదిద్దారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. ఈ ఈవెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినీ ప్రేమికులే కాదు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ట్రైలర్ రిలీజ్ నుంచి ఈ సినిమాకు హైప్ పెరిగింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. కాగా థియేటర్లో విడుదలైన 8 వారాల తర్వాత ఆదిపురుష్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.