Varalakshmi Vratam : ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేయడం వలన వరలక్ష్మి దేవి కోరికలు నెరవేరుస్తుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన నెలల్లో శ్రావణమాసం ఒకటి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చేసే పూజలు నోములు ఈ మాసంలో ఉంటాయి. ఈ శ్రావణమాసంలో ఆగస్టు 16వ తేదీన ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఆ రోజున వ్రతం చేసుకోవడానికి శుభ సమయం ఎప్పుడు అనే దాని గురించి చూద్దాము.. సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 05:07 నిమిషాల నుంచి 8:14 నిమిషాల వరకు ఉంటుంది. దీని వ్యవధి రెండు గంటల 17 నిమిషాలు. వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుంచి మూడు గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి వచ్చేసి రెండు గంటల 19 నిమిషాలు.
కుంభ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం 06:05 నిమిషాలకు మొదలవుతుంది. రాత్రి 08:02 వరకు ఉంటుంది. వ్యవధి 27 నిమిషాలు. వృషభ లగ్న పూజ మొత్తం అర్ధరాత్రి 11:22 నిమిషాల నుంచి తెల్లవారుజాము 1:18 నిమిషాల వరకు ఉంటుంది. వ్యవధి వచ్చేసి 56 నిమిషాలు. వ్రతం చేసే మహిళలు తెల్లవారుజామున నిద్రలేవాలి. బంగారు వర్ణం ఆకుపచ్చ లేదా గులాబీ వంటి రంగుల్లో ఉండే చీర కట్టుకోవాలి. తర్వాత పూజ గదిలో వ్రతం చేసుకునే స్థలాన్ని శుభ్రం చేయాలి. గంగా జలాన్ని పూజ గదిలో చల్లి శుద్ధి చేసుకోవాలి. పూజ గదిలో ముగ్గులు వేయాలి.
ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కట్టి పూలతో అలంకరించాలి. చెక్క పీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టాలి. బియ్యంతో నింపిన కలశాన్ని అమ్మవారి కోసం ఏర్పాటు చేయాలి. లక్ష్మీదేవి గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అలంకరించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అగరబత్తులని వెలిగించి గణపతి దేవుడికి పూజ చేయాలి. వరలక్ష్మి దేవి పూజ మొదలుపెట్టి వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు మూడు, ఐదు, తొమ్మిది రకాలతో వరలక్ష్మి దేవికి నైవేద్యం పెడతారు. ముత్తైదువులకి పసుపు కుంకుమ, శనగలతో తాంబూలాన్ని పెట్టి వాయనం ఇవ్వాలి.