15 రోజుల్లో 2 లక్షల రుణ మాఫీ.. చరిత్రలో లిఖించదగ్గ రోజు..!

-

ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశాం. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి మరి రుణ మాఫీ చేస్తున్నాము అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇది దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు. పదేళ్ల లో లక్ష రూపాయలు కూడా రుణ మాఫీ కూడా చెయ్యలేదు BRS ప్రభుత్వం. 15 రోజుల్లో 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత మా ఇందిరమ్మ ప్రభుత్వంకే దక్కుతుంది. 72 వేల కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించాం.

హరీష్ రావు , కేటీఆర్ లు సీతారామ ప్రాజెక్ట్ ను విమర్శిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు మీదే.. మీ మానస పుత్రికే. కానీ డబ్బుల కోసం కక్కుర్తి కోసం డిజైన్ మార్చి 23 వేల కోట్లకి పెంచారు. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. 125 వేల కోట్లు రాష్ట్రం లో ప్రాజెక్టు ల పేరిట దోపిడీ చేశారు. డబ్బులు దండిగా వస్తాయని పంపులు తెచ్చారు. కానీ మేము కేవలం 75 కోట్ల తో రాజీవ్ లింక్ కెనాల్ తో నీళ్లు ఇస్తున్నాం. ప్రోజెక్ట్ పై చర్చించడానికి మేము సిద్ధం. ఎక్కడికి వస్తారో చెప్పండి అని భట్టి విక్రమార్క ఛాలెంజ్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news