భక్తి: వీటిని దానం చేస్తే సమస్యలే…!

-

ఒకరికి దానం చేయడం అనేది నిజంగా చాలా గొప్పది. పూర్వకాలం నుండి పెద్దలు దానాలు చేయడం మంచిది అని చెప్పడం మనం వినే ఉంటాం. దానం చేయడం వల్ల ఎంతో గొప్ప పుణ్యాన్ని మనం పొందొచ్చు. అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్ప విషయం అని అందరికి తెలుసు.

 

Goddess Lakshmi Devi | శ్రావ‌ణ మాసం

అన్నం కనుక దానం చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. అదేవిధంగా ఒకరికి మనం మేలు చేసిన వాళ్లమవుతాం. అయితే ఏ దానం చేసినా ఎట్టిపరిస్థితుల్లో వీటిని మాత్రం దానం చేయకూడదు. జీవితంలో వీటిని దానం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏ దానాలు చేయకూడదు అనేది ఇప్పుడు మనం చూద్దాం.

పాడైపోయిన ఆహారం పెట్టడం:

ఎవరికైనా పాడైపోయిన ఆహారాన్ని పెట్టడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల జీవితం కూడా పాడైపోతుంది అని నిపుణులు చెబుతున్నారు.

స్టీల్ పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు:

స్టీల్ పాత్రలు లేదా ఇత్తడి పాత్రలు అసలు దానం చేయకూడదు. వీటిని దానం చేయడం వల్ల ఆనందం దూరమవుతుంది.

నూనె:

మనం ఇంట్లో ఉపయోగించే నూనె కూడా అసలు దానం చేయకూడదు. దీనివల్ల కష్టాలు ఎక్కువ అవుతాయి.

పుస్తకాలు:

పుస్తకాలను కూడా ఎప్పుడు దానం చేయకూడదు. ఇది కూడా అస్సలు మంచిది కాదు. అదేవిధంగా చీపురుని కూడా దానం చేయకూడదు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. దీనిని దానం ఇస్తే సంపాదన కూడా కర్పూరంలా కరిగిపోతుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా వీటిని దానం చేయొద్దు వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version