చిన్నారుల కు కరోనా నియంత్రణ టీకా విషయం లో సీరం సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏడేళ్ల లోపు చిన్నారుల కు మరో ఆరు నెల లో కోవావాక్స్ అనే టీకా అందుబాటు లోకి రానుందని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ప్రకటించారు. ఇప్పటి వరకు చేసిన ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని అదర్ పూనావాలా వెల్లడించారు. ఏడేళ్ల లోపు చిన్న పిల్లల పై కోవావాక్స్ సమర్థవంతం గా పని చేస్తుందని అన్నారు.
అలాగే రెండేళ్ల చిన్నారుల కూ కోవావాక్స్ టీకా వేసేందుకు ప్రయోగాలు చేస్తున్నామని కూడా వెల్లాడించారు. త్వరలో రెండేళ్ల చిన్నారుల కు కూడా టీకా అందుబాటు లోకి వస్తుందని తెలిపారు. అలాగే మన దేశంలో కావాల్సిన అన్ని కోవావాక్స్ టీకాలు నిల్వ ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే కోవావాక్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తం గా అందుబాటు లో కి తీసుకువస్తామని అదర్ పూనావాలా తెలిపారు. అయితే ఈ టీకాను అమెరికా లో నోవావాక్స్ అని పిలుస్తారు.