ఆచార్య నుంచి బిగ్ అప్డేట్.. చిరంజీవిపై అస్సలు తగ్గేదెలా అంటున్న చరణ్

-

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి- మె గా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను ఇంకా పెంచేసింది.


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్..డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగ రాస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తండ్రీ తనయులు చిరు-చెర్రీలను వెండితెరపైన చూసి మెగా అభిమానులు సంబురాలు చేసుకోనున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 18 వ తేదీన ఆచార్య సినిమాలోని భలేభలేబంజారా పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో చిరు, చరణ్ సరదాగా మాట్లాడారు. కాగా ఈ మూవీ 29 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version