అలాంటి పని చేసి షాక్ ఇచ్చిన భాను శ్రీ మెహ్రా..!

-

భాను శ్రీ మెహ్రా.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆమెకు మరో సినిమాలో అవకాశం రాకుండా పోయిందని చెప్పాలి. హీరోయిన్గా ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన ఈమెకు ఆ సినిమాతోనే తన భవిష్యత్తు మొత్తం కూలిపోయిందని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత అడపాదడపా ఒకటి రెండు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలలో నటించిన కూడా అవి ఏవి ఈమె కెరియర్ కు ఉపయోగపడలేదు.

ఇకపోతే అల్లు అర్జున్ సినిమాతో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్న ఆమెకు ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఖాళీగా ఉంటుంది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసిన ఈమె తన దినచర్యలను అందులో అప్డేట్ చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంటుంది.. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారు అంటూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి అందరిని షాక్ కి గురి చేసింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత ఒక గంటకే శుభవార్త వచ్చింది .. అల్లు అర్జున్ నన్ను మళ్లీ అన్బ్లాక్ చేశాడు.. నా కెరియర్ పోవడానికి నేను అతడిని నిందించడం లేదు అంటూ తెలిపింది.

సినిమాలలో అవకాశాలు రావడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెలింగ్ వీడియోలను పెడుతూ దేశంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతోంది. సరైన సమాచారం పెడుతూ బాగానే వ్యూస్ సంపాదిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కనీసం ఎవరైనా ఎప్పటికైనా క్యారెక్టర్ రోల్స్ అయినా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తోంది. ఏది ఏమైనా ఈమె ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news