భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ముందస్తు చర్చలు జరపనుంది. ఈ మేరకు బుధవారం భేటీ జరగనుంది. భారతదేశపు మొట్టమొదటి వ్యాక్సిన్ అయిన కోవ్యాక్సిన్ ని అత్యవసర వినియోగంలో చేర్చాలని అందుకు కావాల్సిన అన్ని వివరాలను, వ్యాక్సిన్ షాట్ క్వాలిటీ సంబంధిత విషయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు ఉంచనుంది. ఈ వ్యాక్సిన్ విషయంలో ఆసక్తి చూపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ముందస్తు మీటింగ్ కి హాజరు కావాలని భారత్ బయోటెక్ కి సూచించింది.
జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి వస్తుందని భారత్ బయోటెక్ భావించింది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి భారతదేశంలో కోవ్యాక్సిన్ ని ప్రజలకి ఇస్తున్నారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని పెద్ద మొత్తంలో ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు.