ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థతో ప్రియాంక చోప్రా డీల్

-

బాలీవుడ్ నుంచి..హాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా హవా మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె దశ మరింత తిరిగిపోయింది. మంచి మంచి సినీ ప్రాజెక్టులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా చాన్సులు కొట్టేస్తున్నారు. ఇప్పటికే అనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించి…తన మార్క్ చూపించారు. ఇప్పుడు మరో బిగ్ కంపెనీతో ప్రియాంక చోప్రా డీల్ కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటైన కంపెనీతో కలిసి నడవనున్నారు.

ప్రియాంక చోప్రా జోనాస్ ఇప్పటికే చాలా ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. తాజాగా గ్లోబల్ ఇన్నర్వేర్ బ్రాండ్.. విక్టోరియా సీక్రెట్‌కు అంబాసిడర్‌గా ఎంపియ్యారు.. బ్రాండ్ ప్రమోషన్ విషయంలో సరిగ్గా డీల్ చేయలేక విక్టోరియా సీక్రెట్.. ఇండియాలో వెలగలేకపోతోంది. ఇంటర్నేషనల్ ఇన్వెష్టర్లను ఇండియన్లు అట్రాక్ట్ చేయలేదని అర్థం చేసుకుని.. దేశీ గాళ్ ప్రియాంకతో లోదుస్తుల బ్రాండ్ ఒప్పందం చేసుకున్నారు. ప్రియాంకతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు… ఈ బ్రాండ్ కోసం పనిచేస్తున్నారు. ఇండియాకు సంబంధించి మాత్రం.. ప్రియాంక అతి పెద్ద బాధ్యతను తీసుకోను న్నారు.

ఆమెరికన్ పాప్ సింగర్ నిక్జోనస్ వివాహం తర్వాత.. ప్రియాంక లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్లోనే పలు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు రీసెంట్‌గా మరో వెబ్ సీరిస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ప్రకటనతో ప్రియాంక చోప్రా రెండు చేతులా సంపాదిస్తున్నారు. అంతేకాదు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ బాలీవుడ్ కమ్ హాలీవుడ్ స్టార్ నిరూపించుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news