ప్రాంతీయ పార్టీల ఆదాయం డబుల్.. BRSపై కనకవర్షం

-

తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి 2021-22 ఏడాదికి ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 218 కోట్లను ఆదాయంగా పొందింది. బీఆర్ఎస్ సహా వైఎస్సార్సీపీ, టీడీపీ, డీఎంకే, జేడియు, ఆప్ వంటి 10 ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 852 కోట్లు సంపాదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటీక్ రిఫార్మ్స్ తాజా నివేదికలో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా మొత్తం 36 ప్రాంతీయ పార్టీలకు బాండ్ల ద్వారా రూ.1213 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేసింది. 2021-22 కు గాను భారత ఎన్నికల సంఘానికి పార్టీలు తమ ఆడిట్ నివేదికలను సమర్పించాయి. ఆ నివేదికల ప్రకారం డీఎంకే, బీజేడీ, టిఆర్ఎస్, వైఎస్ఆర్సిపి, టిడిపి, జెడీయు, ఎస్ పి, అప్, ఎస్ఏడి, ఎంజిపి పార్టీలు తమకు బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రూ.852 కోట్లుగా బహిర్గత పరిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news