రేణూ దేశాయ్ ను బాధపెట్టిన పవన్ ఫ్యాన్స్.. కారణం..?

-

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల మొదటి సంతానం అఖీరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్, రేణు ఇద్దరు విడిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరు కూడా రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. వీరిద్దరికీ ఆద్య అనే అమ్మాయి కూడా జన్మించింది. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల దగ్గర కలిసి లేకపోయినా తల్లి దగ్గర ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పిల్లలుగానే బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక నిన్న అకీరా నందన్ పుట్టినరోజు కాక సోషల్ మీడియా అంతటా పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి మామూలుగా లేదని చెప్పాలి.

ముఖ్యంగా అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా సాయిధరమ్ తేజ్ , చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్ లతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తనకు బర్తడే విషెస్ తెలియజేశారు. అయితే ఒక అభిమాని చేసిన పని మాత్రం రేణు దేశాయ్ ను తీవ్రంగా బాధపెట్టింది.. ఆ కామెంట్స్ ఏమిటంటే.. మా అన్న కొడుకుని చూడాలని మాకు ఉంటుంది.. మీరు తనని దాచి పెట్టకండి. అప్పుడప్పుడు వీడియో, ఫోటోల ద్వారా అయినా చూపిస్తూ ఉండండి అంటూ కామెంట్ చేశారు. దానికి ఘాటుగా బదిలిచ్చిన రేణు దేశాయ్ మీ అన్న కొడుకా..? అకిరా నా కొడుకు.. మీరు వీరాభిమాని అని తెలుస్తోంది.. కానీ మాట్లాడ్డంలో కొంచెం పద్ధతి నేర్చుకోండి అంటూ రిప్లై ఇచ్చింది.

ఇక దీనికి మరొక వీరాభిమాని రిప్లై ఇస్తూ.. తెలుగు స్టేట్స్ లో ఎవరి కొడుకు అంటే తండ్రి పేరే చెబుతాము అది మా కల్చర్ అంటూ శృతి మించిన సమాధానం ఇచ్చాడు. దానికి రేణు దేశాయ్ మీకు జన్మనిచ్చిన అమ్మని అవమానించడం మీ కల్చర్ అంటున్నారా అంటూ రిప్లై ఇచ్చింది. ఇలాగే మరికొందరు కూడా కామెంట్స్ చేస్తూ ఉండగా రేణు దేశాయ్ వాటిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. ఇటువంటి కామెంట్లు పోస్ట్లు పట్టించుకోవడం మానేశాను . కానీ ఇవాళ అఖీరా పుట్టినరోజు కూడా నన్ను నిందిస్తూ కామెంట్లు చేయడం బాధిస్తోంది. 11 ఏళ్ళు అవుతోంది నన్ను ఒక విలన్ గా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ బాధపడింది.

Read more RELATED
Recommended to you

Latest news