నేపాల్ కు మిలియన్ వ్యాక్సిన్ డోస్ లను దానం చేసిన భారత్..!

-

భార‌త్ లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇంకా పూర్తికాలేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ మ‌న‌దేశంలో వ్యాక్సిన్ వేసుకోవాల్సిన వారి సంఖ్య భారీగా ఉంది. ఇదిలా ఉండ‌గానే భార‌త్ ఇత‌ర దేశాల‌కు వ్యాక్సిన్ ల‌ను దానం చేస్తోంది. తాజాగా భార‌త్ నేపాల్ కు 1 మిలియ‌న్ వ్యాక్సిన్ డోసుల‌ను దానం చేసింది. ఈ విష‌యాన్ని నేపాల్ ఇండియా రాయ‌భారి నీలాంబ‌ర్ ఆచార్య వెల్ల‌డించారు. భార‌త్ త‌మ‌కు ఒక మిలియ‌న్ వ్యాక్సిన్ ల‌ను దానం చేయ‌గా మ‌రో రెండు మిలియ‌న్ల వ్యాక్సిన్ ల‌ను కొనుగోలు చేశామ‌ని చెప్పారు.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

అక్టోబ‌ర్ నుండి వ్యాక్సినేష‌న్ కార్య‌క్రామాన్ని ప్రారంభింస్తామ‌ని నీలాంబ‌ర్ ఆచార్య స్ప‌ష్టం చేశారు. ఇక భార‌త్ మ‌రియు నేపాల్ స‌రిహ‌ద్దుల్లో కొన్ని వివాదాలు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని కానీ అవి భార‌త్ తో సంబంధానికి అడ్డుకాద‌ని అన్నారు. భార‌త్ నేపాల్ మ‌ధ్య మంచి బంధం ఉంద‌ని భ‌విష్య‌త్తులో రెండు దేశాల మ‌ధ్య సంబంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ఆచార్య అభిప్రాయ‌ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news