గోర్లని బలంగా, అందంగా తయారు చేసుకోవడానికి పనికొచ్చే ఆయిల్స్..

-

శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే గోర్లకు కూడా సరైన శ్రద్ధ అవసరం. లేదంటే గోర్లు బలహీనంగా మారిపోయి, విరిగిపోయి అందవిహీనంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మహిళలు గోర్లపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. వాటికోసం పార్లర్లలో చాలా ఖర్చుపెడతారు. అలాంటి ఖర్చు అవసరం లేకుండా గోర్ల గురించి శ్రద్ధ తీసుకునే ఇంట్లో ఆయిల్స్ గురించి తెలుసుకుందాం.

అందమైన, బలమైన గోర్లు మీ సొంతం కావడానికి ఇంట్లో తయారు చేసుకునే నూనెలు..

విటమిన్- ఈ ఆయిల్

ఒక విటమిన్ ఈ క్యాప్సుల్
ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె
ఏదైనా ముఖ్యమైన మరొక నూనె-2 నుండి 3చుక్కలు

తయారీ పద్దతి

విటమిన్ ఈ క్యాప్సుల్ని కత్తిరించి ఒక కప్పులో వేయండి. ఆ తర్వాత దానిలో బాదం నూనెతో పాటు మరో ముఖ్యమైన నూనెను జోడించండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మీ గోర్ల పై మర్దన చేయండి. 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే రాత్రిపూట అలాగే వదిలేయవచ్చు.

కాంబో ఆయిల్

ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె
ఒక టేబుల్ స్పూన్ కొబ్బది నూనె

తయారీ

ఈ రెండింటినీ ఒకే దగ్గర మిశ్రమం చేసి గోర్ల మీద మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news