విశాఖపట్నం పోలీసులు నటుడు, టిక్ టాకర్, యూట్యూబర్ భార్గవ్ ను అరెస్ట్ చేశారు. బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో భార్గవ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు మైనర్ బాలిక దిశ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
అయితే బాలిక ఆరోపణల్లో నిజం ఉందని తేలడంతో భార్గవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచడంతో మూడో తేదీ వరకూ రిమాండ్ విధించారు. ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ పేరుతో ఫేమస్ అయిన భార్గవ్ తరువాతి రోజుల్లో టిక్‌టాక్, యూ ట్యూబ్ లో వీడియోలు చేసి కొన్ని సినిమాల్లో సైతం ఛాన్స్ లు సంపాదించాడు. ఇక టిక్‌టాక్ నిషేధానికి గురికావడంతో మోజో, రొపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం భార్గవ్ వీడియోలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఈటీవీ, మాటీవీ లాంటి వాటిలో కూడా మెరుస్తున్నాడు.