NIN డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన భారతీ కులకుర్ణి

-

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కొత్త డైరెక్టర్ గా డాక్టర్ భారతీ కులకుర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె 20 సంవత్సరాలకు పైగా ఐసీఎంఆర్ లో సైంటిస్ట్ గా పని చేశారు. గత మూడు సంవత్సరాలుగా న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో శిశు ఆరోగ్యం, పోషకాహార విభాగానికి హెడ్ గా పని చేస్తున్నారు. ఈమె పూణె విశ్వవిద్యాలయం నుంచి పీడియాట్రిక్స్ లో పట్టా పొందారు.

యూఎస్ఏ లోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్ బెర్గ్ నుంచి పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరల్ డిగ్రీ చేసారు. అలాగే మాత శిశు సంరక్షణ, భారతీయ పిల్లల్లో పెరుగుదల, డెవలప్ మెంట్, రక్తహీనత తగ్గించడం వంటి అంశాలపై పలు పరిశోధనలు చేశారు. ఆమె పరిశోధనలకు జాతీయ, అంతర్జాతీయ నిధుల ఏజెన్సీల నుంచి అనేక పరిశోధన గ్రాంట్లు పొందింది. అంతర్జాతీయ జర్నల్స్ లో 130 కి పైగా ప్రచురణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news