Pawan Kalyan: “భవదీయుడు భగత్ సింగ్” క్రేజీ అప్డేట్..పవన్ ఫోటోలు వైరల్

-

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆయ‌న వ‌రుస సినిమాల‌తో బిజీగా అయ్యాడు.ప్ర‌స్తుతం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో భీమ్లా నాయ‌క్ అనే చిత్రంలో న‌టించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకో వైపు క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. త‌గ్గేదేలే అన్న‌ట్లు తాజా ప‌వ‌న్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ద‌మ‌య్యారు.

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నారు. ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా ? ఎప్పుడెప్పుడూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నది అని ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ స్పాట్‌ కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్‌, దర్శకుడు హరీష్‌ శంకర్‌, హైపర్‌ ఆదీ తదితరులు కనిపించారు. పవన్‌ కళ్యాణ్‌ కు హరీష్‌ కథ చెబుతున్నట్లు ఈపోటోలు చూస్తే అర్థమౌవుతుంది. ఇక త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించబోతున్నట్లు ఈ సందర్భంగా హరీష్‌ శంకర్‌ ప్రకటించారు. మొత్తానికి ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news