Aryan Khan : ఐపీఎల్ వేలంలో ఆర్యన్ ఖాన్ హల్ చల్..వీడియో వైరల్ !

-

ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు చాలా విజ‌యవంతంగా ముగిసింది. ప్లేయ‌ర్ల అనౌన్స్ చేసే ఎడ్మీడ్ డ‌యాస్ కు గుండె పోటు రావ‌డంతో కుప్ప‌కూలరు. దీంతో అతన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘటన తప్ప వేలం.. అధ్యాంతం చాలా చక్కగా సాగింది. అనంత‌రం కామెంట‌ర్ చారు శ‌ర్మ వేలం నిర్వ‌హ‌క బాధ్య‌త‌లు తీసుకున్నాడు. అటు తొలి రోజు ఫ్రొంఛైజీలు ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిపించాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ ఐపీఎల్‌ వేలంలో… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ముంబై డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌.. ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ పిల్లలు.. ఆర్యన్ ఖాన్ మరియు సుహానా ఖాన్ శనివారం జరిగిన IPL వేలంలో తమ తండ్రికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారు.

అయితే.. ఆర్యన్, సుహానాల ఫోటోలను స్వయంగా.. ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ఈ ఈవెంట్‌ లో ఆర్యన్‌ ఖాన్‌ చాలా కూల్‌ గా.. ఏదో కోల్పోయినట్లుగా కనిపించాడు. కాగా..ముంబై క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో సహ పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news