తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి…ఇప్పుడు రాజకీయంగా తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ఇబ్బందిగా మారుతున్నారా? పదే పదే చిరంజీవి, జగన్‌ని కలవడం వల్ల జనసేనకు నష్టం జరగనుందా? అంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అవుననే చెప్పొచ్చు. అసలు ఇప్పుడు రాజకీయాలతో చిరంజీవికి సంబంధం లేని విషయం తెలిసిందే…ఆయన కేవలం ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నిస్తున్నారు..అందుకే జగన్‌ని పదే పదే కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
అయితే ఇలా కలవడం రాజకీయంగా పవన్‌కు ఇబ్బందిగా మారింది…పైగా చిరు, జగన్‌ని పొగడటం, అలాగే జగన్‌కు దండాలు పెట్టడం లాంటి అంశాలు పవన్‌కు రాజకీయంగా నష్టం తెచ్చేలా ఉన్నాయని జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమస్యలు సృష్టించిందే జగన్ ప్రభుత్వమని అందరికీ తెలుసు…మళ్ళీ ఆ సమస్యలని పరిష్కారం పేరుతో హీరోలని తమవద్దకు రప్పించుకుంటున్నారు. దీనికి చిరంజీవి పెద్దగా వ్యవహరిస్తున్నారు.
ఇలా ఓ వైపు చిరంజీవి ఏమో జగన్‌ని కలవడం, మరో వైపు పవన్ ఏమో..జగన్‌పై పోరాటం చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు కన్ఫ్యూజన్‌లో పడుతున్నారని తెలుస్తోంది…అంటే చిరు వల్ల జగన్‌కు సపోర్ట్ ఇవ్వాలా? లేక పవన్‌తో కలిసి ముందుకెళ్లాలా? అని మెగా ఫ్యాన్స్ క్లారిటీ లేకుండా ఉన్నారని తెలుస్తోంది. అయితే జగన్ గురించి తెలిసిన వారు ఎవరు…చిరంజీవి కలుస్తున్నారని, పొగుడుతున్నారని చెప్పి జగన్‌కు సపోర్ట్ చేయడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా లేరని తెలుస్తోంది.
కాకపోతే మెగా ఫ్యాన్స్‌లో ఉన్న కొంత కన్ఫ్యూజన్‌ని తొలగించడానికి పవన్ రెడీ అవుతున్నారని తెలిసింది…ఆయన ఇకపై జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా పోరాటాన్ని మరింత ఉదృతం చేయనున్నారని సమాచారం…అలాగే సినీ ఇండస్ట్రీలో జగన్ సృష్టించిన సమస్యలని కూడా చెప్పనున్నారని తెలుస్తోంది. అంటే చిరంజీవి వల్ల కలిగిన డ్యామేజ్‌ని సరిచేయడానికి పవన్ ఇంకా దూకుడుగా రాజకీయం చేయనున్నారని తెలుస్తోంది.