Bheemla Nayak OTT : భీమ్లా నాయక్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

-

భీమ్లా నాయక్.. గ‌త కొద్ది రోజుల ముందు థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయి.. ఎన్నో సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ మాస్ ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఈ భీమ్లా నాయ‌క. బాక్సాఫీస్ ను కాకుండా ఓవ‌ర్సీస్ ను కూడా భీమ్లా నాయ‌క్ షేక్ చేసింది. కేవలం 20 రోజుల్లోనే రూ. 200 కోట్ల క‌లెక్షన్ ల‌ను భీమ్లా నాయక్ సొంతం చేసుకుంది. కాగ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ద‌గ్గుబాటి రానా క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ గా న‌టించిన భీమ్లా నాయ‌క్.. ఓటీటీ విడుద‌ల కు సిద్ధం అవుతుంది.

ఈ నెల 25వ తేదీన ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్, రానా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కాగ భీమ్లా నాయ‌క్ సినిమాను మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అందుకున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ అనే సినిమాకు రీమేక్. ఈ అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ ను తెలుగు లో సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అంతే కాకుండా డైలాగ్స్ స్క్రీన్ ప్లే ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అందించాడు.

కాగ ఆత్మ‌గౌర‌వానికి, అహాంకారానికి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్ కాబ‌ట్టి.. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అనుగూణంగా ప‌లు మార్పులు చేసి విడుద‌ల చేశారు. కాగ భీమ్లా నాయక్.. ఈ నెల 25 నుంచి హాట్ స్టార్ తో పాటు ఆహా లోనూ స్ట్రీమ్ కానుంది. కాగ థీయేట‌ర్ లో బ్లాక్ బాస్ట‌ర్ అయిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రికార్డుల‌ను సృష్టిస్తుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news