ప్రతి ఒక్కరు కూడా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. డబ్బులు కావాలని ఎవరికి ఉండదు..? అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానం కూడా సరిగ్గా ఉండాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు.
అయితే మీ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండాలంటే డబ్బులకు సంబంధించి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను తప్పక తెలుసుకోవాలి. మరి ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేద్దాం. ఈ విషయాలను కనుక మీరు అనుసరించారు అంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.
ఇబ్బందుల్లో వున్న పేదలకు సహాయం చేయండి:
పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఎల్లప్పుడూ అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి సహాయం అడిగిన వాళ్ళకి, పేదవాళ్ళకి సాయం చేయండి.
ఆహారాన్ని వృధా చేయొద్దు:
ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎందుకంటే అన్నపూర్ణ దేవి లక్ష్మీదేవి రూపం.
వృధా ఖర్చు చేయకండి:
అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం మంచిది కాదు ఇలా వృధాగా ఖర్చు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
దొంగతనం చేయకండి:
ఇతరులు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటే మీరు దొంగతనం చేశారంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి ఈ తప్పు కూడా చేయొద్దు.
కలిసి వుండండి:
ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి. గొడవలు వంటివి ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఉండదు.