BHEEMLA NAYAK : ఖైదీగా చిరంజీవి, పోలీస్ గా పవన్… సర్ ఫ్రైజ్ వీడియో రిలీజ్

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో.. మెగాస్టార్‌ ఫ్యామిలీ ఉన్న క్రేజ్‌ మరేవరికీ ఉండదు. మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోను తెలుగు ప్రేక్షకులు బాగా స్వీకరించారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లకు ఉన్నంత క్రేజ్‌ ఆ ఫ్యామిలీ ఎవరికీ లేదు. రాదు కూడా. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఒకే స్క్రీన్‌ లో కనిపిస్తే.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతారు.

తాజాగా.. వీరిద్దరూ కలిసి షూటింగ్‌ లో పాల్గొన్న ఓ వీడియోను సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ విడుదల చేసింది. ఈ వీడియోను హీరో రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో మెగాస్టార్‌ ఖైదీ గెటప్‌ లో కనిపించగా.. పవన్‌ కళ్యాణ్‌ పోలీస్‌ గెటప్‌ లో కనిపించారు.

అదేంటీ అనుకుంటున్నారా.. అవును.. గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చిరు ఖైదీ గెటప్, బీమ్లా నాయక్‌ సినిమా పవన్‌ కళ్యాణ్‌ ది పోలీస్‌ గెటప్‌. అయితే.. వీరిద్దరూ షూటింగ్‌ లో ఒకే సమయంలో పాల్గొన్నారు. ఆ వీడియోనే తాజాగా.. హీరో రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ వీడియోను చూసిన మెగా, పవర్‌ ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news