పల్లెల్లో వినిపించే కోయిలకు
నగరం బాట కనిపించిన తీరు
ఓ వైపు ఆనందం మరో వైపు అద్భుతం
ఆ పల్లె కోయిలలకు జేజేలు
సెబ్బాస్ రా భీమ్లా నాయకా
జానపద కళాకారులు కొందరు భీమ్లా నాయక్ సినిమాకు ప్రాణం పోశారు. తెలంగాణ దారుల్లో కనిపించిన అరుదైన గొంతుకలు అక్కడ కూడా వినిపించాయి. ఆహా! అనిపించాయి. పవన్ సినిమా అంటే ఎన్నో ప్రత్యేకతల మేళవింపు.ఆయన సినిమా కు సంబంధించి ఇంకొన్ని విశేషాలు చెప్పేముందు.. ఆ ఇద్దరు కళాకారుల గురించి తెలుసుకోవాల్సిందే! ఆ వివరం ఈ కథనంలో వీధిలో నడయాడే పాట..తెలంగాణ పల్లెల్లో నడయాడే పాట.
సంతల్లో వినిపించే పాట.. ఇప్పుడు ఆ పాటకు ప్రతినిధి గా నిలిచిన మొగులయ్య పద్మశ్రీ అయ్యారు. 12మెట్ల కిన్నెర వాద్యాన్ని మొగిస్తూ ఆలపించిన పాటకు ప్రతినిధిగా అరుదైన కళాకారుడిగా పేరున్న మొగులయ్య మరింత ప్రసిద్ధులయ్యారు. గానం సిద్ధుడిది.. ఇప్పుడీ గానం ప్రసిద్ధత కు ఆనవాలుగా నిలిచిన సిద్ధుడిది.
అవును భీమ్లా నాయక్ లో ఆయన పాడినవి కొన్నింటే కొన్ని పంక్తులే కానీ అవి అతని జీవితాన్ని మార్చాయి. అవి ఆయనకు కొత్త ప్రపంచాన్ని పరిచయంచేశాయి. మళ్లీ వీలుంటే అవకాశం ఇయ్యుండ్రి సారూ.. అని వేడుకుంటున్నారు మొగిలయ్య. తమన్ పాదాభివందనం చేశారు ఆయనకు..పవన్ మళ్లీ ఆనందించారు. ఆయన అభిమానులు ఇంకాస్త వేడుక చేసుకున్నారు.
పవన్ కు మాత్రమే తెలిసిన విద్య ఇది.. ఎక్కడో కొండ కోనల్లో అడవి దారుల్లో ఆగిపోయిన పాటకు కొనసాగింపు ఇవ్వడం. అదేవిధంగా దుర్గవ్వ వచ్చారు. మంచిర్యాల దారుల నుంచి వచ్చారు. ఆమె పాడుతుంటే మరొక పరవశం కేటీఆర్ కు.. ఇలాంటి గొంతుకలు సినిమా పాటలకు సరిపోతాయా అన్న సందేహం లేదు.. సంశయం లేదు.. పవన్ తనవంతు సాయం వీరిద్దరికీ చేసి పంపుతారు.
నేను నా వంతు ప్రయత్నం చేశాను మీరు మీ ప్రయత్నం చేయండి.. నేను నా అభిమానులు మీతోనే ఉంటారు అని ధైర్యంచెప్పి పంపుతారు. కేటీఆర్ చూసి ఎంతో ఆనందిస్తారు. ప్రాంతాల మధ్య పొందాల్సిన సఖ్యత ఇది..ఐక్యత ఇది…ఆనందించాలి మీరు..
ఆనందించాను నేను..
ఇద్దరు తెలంగాణ జానపద కళాకారులు వేర్వేరు సందర్భాల్లో పాడుతున్నారు.వారితో పాటే పవన్ ఉన్నారు. వారితో పాటే కేసీఆర్ ఉన్నారు. వారితో పాటే తలసాని ఉన్నారు. ఇంకా ఎందరెందరో ఉన్నారు. వారికి ధైర్య వచనం చెబుతున్నారు. వారికి ఆత్మీయ వచనం అందిస్తున్నారు. వారి పాటకు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు పవన్ మరియు ఇంకొందరు. భీమ్లా నాయక్ వేడుకల్లో ఆ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణ. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎక్కడెక్కడో కళాకారులను మారుమూల ప్రాంతాలకు చెందిన కళాకారులను వెతికి వెతికి తీసుకువచ్చి వారి కళకు ఓ విలువ ఇస్తారు.
వారి కళకు ఉన్న విలువను పెంచి పంపుతారు. ఆ విధంగా పవన్ కల్యాణ్ ఎందరినో ఆలోచింపజేస్తారు అని! ఆయనే కాదు నిన్నటి వేళ కేటీఆర్ కూడా పొంగిపోయారు. దుర్గవ్వ పాడుతుంటే పొంగిపోయారు. మొగిలయ్య పాడుతుంటే పొంగిపోయారు. రెండు ప్రాంతాల సాంస్కృతిక వారథులు వాళ్లు. జేజేలు పలికారు కేటీఆర్. జేజేలు పలికారు పవన్.