సంచనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. రచ్చ చేస్తూ ఉంటారు వర్మ. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్ చేస్తూ… కౌంటర్లు పేల్చుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల బయోగ్రఫీ లపై సినిమాలు తీస్తూ ఉంటారు వర్మ.
ఇక తాజాగా నిన్న జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ పై ట్వీట్ చేశారు వర్మ. నిన్నటి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్… సినిమా కళాకారులపై చేసిన కామెంట్లకు తాను ఫిదా అయిపోయానని వర్మ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఇచ్చిన ప్రశంగాల్లో చాలా గొప్పదని వర్మ కొనియాడారు. ఇది ఇలా ఉండగా.. సినిమా లేకపోతే ఇవాళ ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదు అని పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు.
నిజమైన కళాకారునికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని పేర్కొన్నారు. చెన్నైలో ఉండే చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఎందరో సినీ పెద్దలతో పాటు చెన్నారెడ్డి లాంటి మహానీయలు తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత అభివృద్ధి చేసేవిధంగా తోడ్పాటునందించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.సినిమా లేకపోతే ఇవాళ ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదు అని పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
This is one of the best speeches of @PawanKalyan ever ..So heart felt , emotional and humble https://t.co/x5iGiSnowC via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2022