Bholashankar: చిరంజీవి భోళా శంకర్ నుంచి లీకైన వీడియో సాంగ్..!!

-

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు .స్వయంకృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో రూ .100 కోట్ల కలెక్షన్లను అందుకున్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం బోళా శంకర్. ఈ చిత్రం తమిళ సినిమా ఆయన వేదాళం సినిమాకి రీమిక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. తాజాగా బోలా శంకర్ సినిమాకు కూడా లీకుల బెడద తప్పడం లేదు.. ఇప్పటికే ఎన్నో సినిమాలు సైతం ఇలా లీక్ అయ్యి ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షూటింగ్ నుంచి ఫోటోలు మాత్రం లీక్ అవుతూనే ఉన్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా నుంచి ఏకంగా ఒక పాట క్లిప్ నెట్టింట వైరల్ గా మారుతోంది. లీకైన క్లిప్ లో తమన్నా, చిరంజీవి కలిసి డాన్స్ వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 

అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారుతోంది .యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం తమ అందిస్తూ ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version