త్వరలో జరగబోయే ఎన్నికల కోసమే కేంద్రం 2 వేల నోట్లను ఉపసంహరించుకుందని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజంగా అవినీతిని అంతం చేయాలని కేంద్రం భావిస్తే 2000 నోటును వెంటనే రద్దు చేయాల్సిందని అన్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్ మనీ గా మారిందని విమర్శించారు.
దేశంలో అవినీతిని అంతం చేసి ఒక్కొక్కరి ఖాతాలలో 15 లక్షలు వేస్తానన్న మోడీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఎవరి అకౌంట్లో పైసా కూడా జమ కాలేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సిపిఐ నారాయణ. బిజెపికి వ్యతిరేకమైన ప్రభుత్వాలను తొక్కేసేందుకు గవర్నర్ల వ్యవస్థతో ఎదురు వస్తుందన్నారు.