భోలే బాబా సత్సంగ్ లో తొక్కిసలాట.. 23 మంది మృతి..!

-

ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 23 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  హత్రాస్ లోని భోలే బాబా సత్సంగ్ లో  చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో దాదాపు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. తొక్కిసలాటలో గాయపడిన 15 మంది మహిళలు, పిల్లలను చికిత్స కోసం ఉటాహ్ మెడికల్ కాలేజీలో చేర్చారు.

అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఈ తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version