ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ను జస్టిస్ ఎన్వీ రమణ భూమిపూజ

-

గచ్చిబౌలి లో IAMC (ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియోషన్ సెంటర్) బిల్డింగ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశం లో మొదటి IAMC (అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం) సెంటర్ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

సుప్రీంకోర్టు జడ్జీలు హిమా కోహ్లీ, నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజే సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతోందని.. భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎంతో విలువైన భూమిని గచ్చిబౌలి లో కేటాయించినందుకు కెసిఆర్ కు ధన్యవాదాలు అని.. 50 కోట్ల రూపాయలు నిర్మాణానికి కేటాయించడం ముందడుగు అన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల హైదరాబాద్ కు మరింత పేరు వస్తుందని… సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని కోరారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆశిస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version