బీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలకు  జనం వారి  చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటారు : ఎమ్మెల్యే బాలు నాయక్

-

బీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలకు  జనం వారి  చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటారని దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. లగచర్ల ఘటన పై ఎమ్మెల్యే బాలు నాయక్  మీడియాతో మాట్లాడారు. లగచర్లలో కలెక్టర్,  ఉన్నతాధికారులపైన జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. కొడంగల్ లో గిరిజనులు, లంబాడిలకు మేలు జరగకూడదనే బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లనే దాడి జరిగింది. లంబాడి లు ఎప్పటికి కేటీఆర్ ను క్షమించరు అన్నారు.

ఖమ్మం లో లంబాడి మిర్చి రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండా లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి లంబాడిలపైన గుండాలతో దాడి చేయిస్తే దాన్ని కేటీఆర్ సమర్థించాడు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గిరిజన ఆడ బిడ్డను చెట్టుకి కట్టేసి కొట్టిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఉగ్రవాదుల కంటే అధ్వానంగా లంబాడిలపైన గతంలో దమనకాండ కొనసాగింది. నేరెళ్ల లో దళితులపైన చిత్రహింసలు పెట్టించిన చరిత్ర కేటీఆర్ ది. బందిపోట్లు లా తెలంగాణను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కి సెంటు స్థలం కేటాయించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయడమే కేటీఆర్ పని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ళ యాత్ర చేసినా జనం నమ్మరని పేర్కొన్నారు ఎమ్మెల్యే బాలు నాయక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version