కాంగ్రెస్ తరపున సీఎం ఎవరనేది నిర్ణయించేది వారే: భట్టి విక్రమార్క

-

తెలంగాణాలో ఎన్నికలకు ఇంకో తొమ్మిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు అందరూ ఎన్నికలలో ఎలా గెలవాలన్న విషయం మీదనే దృష్టిని కేంద్రీకరించారు. ఇక ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగిలి కాంగ్రెస్ మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకోనుందని సర్వేలు మరియు సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఇక తాజాగా సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ… కేసీఆర్ పై విమర్శలు చేస్తూ అట్టడుగు వర్గాల వారిని పైకి రాకుండా చేస్తున్నాడని కామెంట్ చేశారు. కాంగ్రెస్ రేపు జరగబోయే ఎన్నికల్లో మెజారిటీని తెచ్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. అదే విధంగా కాంగ్రెస్ తరపున సీఎం ఎవరన్న విషయాన్ని నిర్ణయించేది పార్టీ ఎమ్మెల్యేలే అంటూ కామెంట్ చేశారు భట్టి. అంటే ఏ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎవరికైతే ఓటును వేస్తారో వారే సీఎం అవుతారు.

మరి ఈ ఎన్నికలో వాస్తవ ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news