ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాగా వినిపిస్తున్న పేరు భూమా మౌనిక – మంచు మనోజ్.. ఇద్దరూ కూడా రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ జంట పై పలువురు నెటిజెన్లు చాలా క్యూట్ జోడి అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి భూమా మౌనిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈమె ఆస్తుల విలువ సుమారుగా రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
మౌనిక మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గణేష్ రెడ్డి నుంచి ఆమె విడాకులు తీసుకున్నప్పుడు అదే సమయంలో 250 కోట్ల రూపాయలను భరణంగా తీసుకుందని సమాచారం. అలాగే మౌనిక పేరుపైన కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆళ్లగడ్డ , కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆమె పేరు పైన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవని సమాచారం.
అయితే భూమా మౌనిక మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడు మనోజ్ ను చాలా కాలంగా ప్రేమించి తాజాగా మార్చి మూడవ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. మనోజ్ , మౌనిక ఒకరికొకరు కెరియర్ పరంగా హెల్ప్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. మనోజ్ సినిమాలలో సత్తా చాటే దిశగా అడుగులు వేస్తే.. మౌనిక రాజకీయాల వైపు దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే వీరి కెరియర్ ప్లానింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.