హోలీ రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను కొనండి..అదృష్టం వదిలి వెళ్ళదు..

-

హోలీ పండుగ అంటే రంగులు మాత్రమే కాదు మన అదృష్టాన్ని కూడా పెంచుకొనే పండుగ..ఈ పండుగ రోజు కొన్ని వస్తువులను కొంటె అదృష్టం మనల్ని విడిచి పోదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఈ ఏడాది హోలీ పండుగ ను దేశవ్యాప్తంగా ప్రజలందరూ మార్చి 8వ తేదీన జరుపుకుంటారు.హోలీ పండుగ కోసం చాలామంది ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఒకరినొకరు రంగులు పూసుకుంటూ ప్రజలు తమ కష్టాలన్నీ మర్చిపోయి హోలీ రంగులో సంతోషంగా ఉంటారు… ఈ ఈరోజు ఎటువంటి వస్తువులను కొంటె మంచి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

హోళికా దహనంతో చెడును, స్వార్ధాన్ని, కాల్చివేసి మంచి వైపు అడుగులు వేసే రంగుల పండుగ హోలీ పండుగ.హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంట్లో సంపదకు అసలు లోటు ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పౌర్ణమి రోజు వెండి నాణెం, వెండి చిన్నపెట్టే కొనడం మంచిది..వాటిని పసుపు రంగును పూసి, పసుపు రంగు గుడ్డలో కట్టి లక్ష్మీదేవి పటం వెనక పెట్టాలి. ఇక హోలీ పౌర్ణమి రోజు హోలికను కాల్చిన తర్వాత లభించే బూడిదను మీరు కొన్న వెండి పెట్టలో వేసి అల్మారాలో ఉంచాలి.హోలీ పౌర్ణమి రోజు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

వెండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.వెండిని ధరించడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. చిన్న పిల్లలకు వెండి కంకణాలు ధరించడం వల్ల, వారి కండరాలను బలోపేతం చేస్తాయి. హోలీ పౌర్ణమి రోజున వెండి ఉంగరాన్ని కొని పూజించాలి. పూజించిన ఉంగరాన్ని ప్రసాదంగా స్వీకరించి ధరించడం వల్ల అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది.. మహిళలు పట్టీలు కొన్నా మంచిదే.. వెండి పట్టిలు కొనుగోలు చేసిన తర్వాత పాలతో కడగాలి. అప్పుడు మీరు దానిని స్నేహితులకు ఇవ్వవచ్చు లేదా మీరే ధరించవచ్చు.. అమ్మవారి కటాక్షం లభిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news