ఫించన్ లబ్దిదారులకు బిగ్ షాక్..!

-

ఫించన్ లబ్దిదారులకు బిగ్ షాక్. దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ షాక్ ఇచ్చింది. 2014 సెప్టెంబర్ కు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీచేసింది.

సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు పేరా 26(6) కింద, పింఛను నిధికి 8.33% వాటా చెల్లించేందుకు పేరా 11(3) కింద యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారాలను అందజేయాలని సూచించింది. వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించకుంటే ఇప్పటివరకు చెల్లింపులు చేసిన అధిక పింఛన్ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2015 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పింఛనుకు అర్హత పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news