తిరుపతి ఎమ్మెల్యే భూమనకి రెండో సారి కరోనా

-

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా అదుపులోకి వస్తోంది. కొద్ది రోజుల క్రితం దాకా రోజూ 10 వేలకు పైగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు 5 వేలకు అటూ ఇటుగా ఉంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 50 వేల కంటే తక్కువగానే ఉండటం కాస్త ఊరట కలిగించే అంశమే. కానీ ఏపీలో రెండో సారి కరోనా బారిన పడుతున్న వారి గురించి ఇప్పుడు టెన్షన్ ఎక్కువయింది. తాజాగా ఏపీలోని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి రెండో సారి కరోనా బారిన పడ్డారు. మరో సారి ఆయనకు పాజిటివ్ వచ్చింది.

ఆగస్టు 24 తేదీన తొలి సారిగా భూమన కరోనా బారిన పడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరారు. కరకంబాడి రోడ్డులోని గోవిందధామంలో కరోనా వైరస్ మృతదేహాలకు ఖననంపై అపోహలు తొలగించేందుకు అంతకు ముందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు దహన సంస్కారాలు చేసిన కొద్ది రోజులకు ఆయనకు తొలిసారి కరోనా సోకింది. ఆ తర్వాత కోలుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా బారిన పడ్డారు భూమన. ఆయన కంటే ముందు కుమారుడికి కూడా రెండో సారి కరోనా వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడం ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news