RRR : 5 భాషల్లో సాంగ్… ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బిగ్ అనౌన్స్ మెంట్…

-

ప్ర‌పంచ‌మంతా ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్ ( RRR Movie ). ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్ ను పెంచేశాయి. ఇది ఇలా ఉండగా.. అయితే… ఇవాళ చెప్పినట్లుగానే ఓ బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ప్రకటించేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. ఈ మూవీలోని తొలి పాటను ఆగస్టు 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

ఈ సాంగ్‌ ఏకంగా 5 భాషల్లో చేయనున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం ప్రకటించింది. దోస్తీ పేరుతో ఈ సాంగ్‌ సాగనున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం వెల్లడించింది. తెలుగులో సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన ఈ పాటను హేమ చంద్ర పాడగా.. కీరవాణి మ్యూజిక్‌ అందించారు. అయితే.. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో సంగత దర్శకుడు ఎం ఎం కీరవాణీ తో సహా… అనుదీప్‌, హేమ చంద్ర, అమిత్‌ త్రివేది, విజయ్‌ ఏసుదాసు, నజీర్‌ కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news