రేవంత్ కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు…!

-

తెలంగాణ కాంగ్రెస్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తల దూరుస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. భూకబ్జా ఆరోపణ లతో గత కొంతకాలంగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఆయన దోషిగా తేలితే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ ఆయన పై కఠిన చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ని కాపాడటానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారట. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని చంద్రబాబుకు సమాచారం అందింది. దానికి తోడు తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఎక్కువగా ఉంది. దీనితో ఆయనకు బెయిల్ రావడం లేదు అనేది కొందరి మాట. కావాలనే ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ కూడా భావిస్తున్నారు.

ఈ తరుణంలో రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు నేరుగా రేవంత్ కోసం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారని అందుకే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ విషయంలో ఆయన కోసం సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ ని హైదరాబాద్ పంపిందని అంటున్నారు. కేటీఆర్ ఇంటిపై డ్రోన్ ఎగరేసిన కేసులో రేవంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారని ఆయన హై కోర్టుకు వెళ్లినా మియాపూర్ కోర్టుకు వెళ్ళినా ఆయనకు బెయిలు రాలేదని, దీంతో చంద్రబాబు తనవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టి రేవంత్ ను బయటకు తీసుకు వచ్చే కార్యక్రమాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు దోషులు గానే ఉన్నారు. దీనిపై అప్పట్లో రేవంత్ రెడ్డి స్పాట్ లో దొరికిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news