కూతురుతో బాల ఆదిత్య సంతోషం! బిగ్ బాస్ హౌస్ మేట్ల హంగామా.!

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఆరుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా కూడా గొడవలు పడే వారిని చూసే మనస్తత్వం కలిగిన వారికి ఇది బాగానే నచ్చుతుంది. ఇక హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిన వారు ఇంటర్వ్యూ లు , ఫొటో సెషన్ లు చేస్తూ మధ్య మధ్యలో తన హౌస్ మేట్ల ఫంక్షన్స్ కు వెళుతూ హంగామా చేస్తూ ఉన్నారు.

ఇక గతంలో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినబాల ఆదిత్య హాస్ లో సౌమ్యుడు గా పెద్దమనిషి గా పేరు తెచ్చుకున్నాడు.రేలంగి మామయ్యగాఏదైనా సమయస్ఫూర్తితో మాట్లాడేవాడు. సహనం కోల్పోకుండా సమాధానం ఇచ్చేవాడు. ఇంటి సభ్యులకు మంచి మాటలు చెప్పేవాడు. అందరూ ముద్దుగా రేలంగి మామయ్యగా పిలిచే వారు

బాల ఆదిత్య  భార్య రెండో కూతురికి జన్మనిచ్చారు. కూతురు పుట్టిన వెంటనే బాల ఆదిత్య బిగ్ బాస్ షో కు వెళ్ళడం వల్ల  కూతురికి పేరు పెట్టలేదు. నిన్న  డిసెంబర్ 15న బాల ఆదిత్య రెండో కూతురి బారసాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సూర్య గీతూ, ఇనయా ఆరోహిరావు,వాసంతి  వంటి వారు పాల్గొని హడావుడి చేశారు.ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో లో వైరల్ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news