మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే వీటిని మరచిపోవద్దు..!

-

పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లల్ని మంచి మార్గంలో వెళ్ళేటట్టు చూసుకోవాలి. పిల్లలు చక్కని బాట పట్టేలా బాధ్యత వహించాలి. పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధగా ఉండకపోతే పిల్లల భవిష్యత్తు చేతులారా మీరే పాడు చేసినట్లు అవుతుంది. అయితే పిల్లల్ని పెంచే క్రమంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు ఈ తప్పులు చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు.

పిల్లల్ని ఒత్తిడి చేయకండి:

పిల్లలకు నచ్చని వాటిని ఎంచుకోమని తల్లిదండ్రులు అస్సలు ఒత్తిడి చేయకూడదు వారికి నచ్చిన దారిలో వెళ్లడానికి తల్లిదండ్రులు సహకారం అందించాలి. వారికి నచ్చిన దానిని చేయొద్దు అని వాళ్ళని శిక్షించడం లేదంటే ఒత్తిడి చేయడం మంచిది కాదు.

ఇతరులతో పోల్చకండి:

ఎప్పుడు కూడా మీ పిల్లల్ని మరొకరితో పోల్చకండి. మరొకరితో మీ పిల్లల్ని పోల్చడం వలన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పిల్లలని మరొక పిల్లలతో పోల్చొద్దు. పిల్లల్ని పిల్లల్లాగే ఉంచండి. పిల్లలు చాలా అమాయకులు వాళ్ళు చాలా ప్యూర్ గా ఉంటారు కాబట్టి వాళ్లని అలానే ఉంచండి. ఏదైనా ఆలోచించేటప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి.

తప్పులు చేసినా పర్వాలేదు:

పిల్లలు ఇంకా అన్ని నేర్చుకోలేదు. పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులని కరెక్ట్ చేయాలి తప్ప తప్పులు చేయొద్దు. శిక్షించకూడదు.

పిల్లల ప్రైవేట్ స్పేస్ ని గౌరవించండి:

పిల్లల ప్రైవేట్ స్పేస్ ని మీరు ప్రోత్సహించండి కానీ మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి.

పిల్లలని ఈక్వల్ గా చూడండి:

తల్లిదండ్రులు సమానంగా చూసుకోవాలి అలానే వాళ్ళకి కావలసినవి ఇవ్వడం వాళ్లకి తెలియాల్సినవి నేర్పించడం ఇలా ప్రతిదానిలో కూడా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వాలి.

మాట్లాడటం చాలా ముఖ్యం:

తల్లిదండ్రులకు ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లలతో సమయాన్ని కేటాయించాలి అప్పుడు కచ్చితంగా పిల్లలు అన్నింటినీ నేర్చుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news