‘బిగ్ బాస్’ ఓటీటీ షో ఎనిమిదో వారం కొనసాగుతోంది. బాబా భాస్కర్ వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌజ్ లో సీన్ అయితే మారిపోయిందని చెప్పొచ్చు. భాస్కర్ బిందు మాధవిని సేవ్ చేయడంతో కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఇక బాబా మాస్టర్ ఎంట్రీ పట్ల అఖిల్ హార్ట్ అయ్యాడు. ఈ సంగతులు అలా ఉంచితే..కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో రచ్చ రచ్చ జరిగినట్లు తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో ద్వారా స్పష్టమవుతోంది. సదరు ప్రోమోలో కంటెస్టెంట్స్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఈసారి..డిఫరెంట్ గా ఇచ్చాడు. హ్యూమన్స్ Vs ఏలియన్స్..గా కంటెస్టెంట్స్ ను డివైడ్ చేశాడు. ఇందులో అషురెడ్డి, శివ, మిత్ర, అఖిల్, అనిల్, బాబా భాస్కర్‌లను మనుషుల (హ్యూమన్స్)టీమ్‌గా, అరియానా, బిందుమాధవి, అజయ్, హమీదా, నటరాజ్ మాస్టర్‌లను ఏలియన్స్ టీమ్‌గా సెపరేట్ చేశారు.
ఏలియన్స్ తమ దగ్గరున్న వస్తువులను కాపాడుకుంటుండగా, హ్యూమన్స్ వాటిని పగులగొట్టేందుుక ట్రై చేస్తున్నారు. అలా ఇరు టీమ్ ల మధ్య ఫైట్ జరిగింది. ఇంతలోనే ఏలియన్స్ టీమ్ స్విమ్మింగ్ పూల్ లో దికేశారు. దాంతో అలా చేయడానికి వీల్లేదని ‘బిగ్ బాస్’ స్పష్టం చేశాడు. అలా చేసినందుకు అషురెడ్డికి పనిష్ మెంట్ ఇచ్చాడు.
తన దగ్గర మైక్ ఉండొద్దని, మైక్ ధరించడానికి వీల్లేదన్నాడు. ఈ క్రమంలోనే అరియానా, అషురెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరకు సంచాలక్ గా ఉన్న బాబా భాస్కర్ ..అషురెడ్డి వద్ద నుంచి మైక్ తీసుకున్నాడు. ఇక ఈ గేమ్‌లో హమీదా, మిత్ర మధ్య భౌతిక ఘర్షణ జరిగింది.
మాటలు పెరిగి వీరు కొట్టుకునేదాక వెళ్లిపోయారు. మిత్ర కొడుతుందని, తాను కూడా కొడతానంటూ హమీద ఆమె వెనకాల పరిగెత్తింది. ఈ క్రమంలోనే మిత్రా శర్మ అరిచేసింది. ఈ టాస్క్‌లో హ్యూమన్స్ టీమ్ గెలిచి అందులోని సభ్యులు కెప్టెన్సీ కంటెండర్స్ అయినట్లు సమాచారం. చూడాలి మరి.. ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారో..